కేంద్రం అందిస్తున్న బీమా ప్రయోజనాలలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో ఏడాదికి కేవలం రూ. 20 డిపాజిట్ చేస్తే రూ.2 లక్షల వరకు బీమా ప్రయోజనాలను పొందవచ్చు. 18-70 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు ఎవరైనా ఇందులో చేరవచ్చు. అయితే దేశంలోని ఏదో ఒక బ్యాంకులో తప్పనిసరిగా సేవింగ్స్ ఖాతా ఉండాలి. ఈ బీమా చేసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.2లక్షలు ఆర్థిక సాయం వస్తుంది.