కర్ణాటకలోని చిక్‌మంగుళూరులో విషాధ ఘటన చోటుచేసుకుంది. మాణిక్య ధార కొండపై ఉన్న దేవిరమ్మ జాతరకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. ఎత్తులో ఉండే అమ్మవారిని దర్శించుకోవాలంటే ఎత్తైన కొండను ఎక్కాలి. భక్తుల రద్దీ ఎక్కువ ఉండటంతో పాటు వర్షం కూడా పడటంతో కొండపై నడవడానికి కష్టమైంది. దీంతో భక్తులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని దిగడంతో వర్షానికి జారిపడి తొక్కిసలాట జరిగింది. దీంతో కొండపై నుంచి వందలమందికి పైగా కిందకి జారిపడ్డారు.