నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో జాతీయ రహదారిపై ఉదయం 11 గంటల నుంచి గ్రామస్తులు చేపట్టిన ధర్నాకొనసాగుతుంది. దిలావర్పూర్లో నిర్మించే ఇథనాల్ పరిశ్రమ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నచ్చచెప్పేందుకు వెళ్లిన ఆర్డీవో రత్నకల్యాణిని ఆందోళనకారులు చుట్టుముట్టారు. సుమారు 6 గంటలుగా ఆందోళనకారుల మధ్యే ఆర్డీవో ఉండిపోయారు. కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని గ్రామస్తులు అంటున్నారు.