భారత ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ కొత్త సంవత్సర వేడుకల్లో సందడి చేశాడు. గోవా వేదికగా జరిగిన సంబరాల్లో తన భార్య సాక్షితో కలిసి పాల్గొన్నాడు. ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంది. అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ క్రీకేటర్లు సురేష్ రైనా, గౌతమ్ గంభీర్, సచిన్, ఇర్ఫాన్ పఠాన్, రవిశాస్త్రి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.