తాను డ్రగ్స్ తీసుకున్నట్లు పలు మీడియా ఛానళ్లు తప్పుడు ప్రచారం చేయడంపై నటి హేమ మండిపడ్డారు. తానే స్వయంగా మీడియా పెద్దల వద్దకు వస్తానని, వారే టెస్ట్ చేయించాలని హేమ సవాల్ విసిరారు. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఎంతటి శిక్షయినా అనుభవిస్తానని, నెగిటివ్ వస్తే తనకు న్యాయం చేయాలన్నారు. పరువు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమని హేమ సంచలన ప్రకటన చేశారు.