నిర్మల్ (D) దిలావర్‌పూర్‌కు రావాలని కేటీఆర్‌కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. గ్రామంలో ఇథనాల్ పరిశ్రమకు అన్ని అనుమతులు కేసీఆర్, కేటీఆరే ఇచ్చారని వ్యాఖ్యానించారు. 'కేటీఆర్.. ఆందోళన జరుగుతున్న ప్రాంతానికే వెళ్దాం. ఎవరు అనుమతులిచ్చారో అక్కడే తేల్చుదాం. అనుమతులిచ్చే సమయానికి ఇథనాల్ కంపెనీ డైరెక్టర్‌గా తలసాని సాయి.. మరో డైరెక్టర్‌గా పుట్టా సుధాకర్ కుమారుడు ఉన్నారు. సుధాకర్, శ్రీనివాస్ యాదవ్ వియ్యంకులు’ అని అన్నారు.