తన వైఖరికి భిన్నంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై అనూహ్య ప్రతిపాదన చేశారు. అమెరికా కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ అయిన విదేశీ విద్యార్థులకు నేరుగా గ్రీన్‌కార్డు ఇవ్వాలని భావిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో వలస విధానంపై తరచూ విరుచుకుపడే ఆయన నోటినుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.