ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు లేవు: APSRTC

79చూసినవారు
ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు లేవు: APSRTC
దసరా రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. అక్టోబర్ 4 నుంచి 20 వరకు 6,100 ప్రత్యేక బస్సులను నడపనుంది. జిల్లా కేంద్రాలు, ముఖ్య ప్రాంతాలకు, చెన్నై, బెంగళూరు సహా ఇతర నగరాలకు బస్సులు తిప్పుతామంది. అక్టోబర్ 4 నుంచి 11 వరకు 3040 బస్సులు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు 3060 బస్సులు తిరుగుతాయని చెప్పింది. ఈ ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్