ముక్కలేనిదే ముద్దదిగని వాళ్లు కొంతమంది ఉంటారు. ఎంత వద్దనుకున్నా ఏదో ఒకరకంగా మాంసాహారం ఊరిస్తూనే ఉంటుంది. కానీ, ఇలాంటి వారి కోసం మొక్కల నుంచి ప్రత్యామ్నాయం దొరుకుతుందట. అదే వెజ్ మీట్. మాంసం టెక్చర్‌తోపాటు, పంటికి మాంసం తిన్న ఫీలింగ్‌ని ఇస్తుంది. మొక్కల నుంచి వచ్చే మాంసందే భవిష్యత్ అని చెబుతోంది. ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న నటి జెనీలియా.. వీటితో సీక్ కబాబ్, చికెన్ నగ్గెట్, బిర్యానీ, బర్గర్‌పాటీస్, సాసేజెస్ వంటివి చేసుకోవచ్చట.