శాకాహారంతో రోజువారీ మన శరీరానికి అందాల్సిన ప్రొటీన్ అందదనేది నిజం కాదు. ఎందుకంటే మన శరీర బరువును బట్టి ఒక్కో కిలోకు 0.8 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 50 కిలోలు అనుకుంటే ఆ వ్యక్తి రోజూ 40 గ్రాముల ప్రొటీన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. టోఫూ, జున్ను, పప్పులు, శెనగలు, బఠానీ, తృణ ధాన్యాలు, క్వినోవా, సోయా, నట్స్, గింజలలో ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.