శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషించే యాంటీ ఆక్సిడెంట్లు.. మాంసాహారం తినేవారితో పోలిస్తే శాకాహారం తినేవారిలో విరివిగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. శాకాహారం తీసుకోవడం వల్ల మానసికపరమైన లాభాలతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి పెరగడం వంటి లాభాలు చేకూరుతాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులను మన ఆహారంలో భాగం చేస్తే డిప్రెషన్, యాంగ్జయిటీ దరిచేరవని చెబుతున్నారు.