ప్రముఖ నటుడు కొణిదెల
నాగబాబు కుమార్తె నిహారిక, మాజీ ఐజీ ప్రభాకరరావు కుమారుడు చైతన్యలకు విడాకులు మంజూరయ్యాయి. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం ఏప్రిల్ 1న కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకోగా, జూన్ 5న విడాకులు మంజూరయినట్లు తెలుస్తోంది. కాగా, నిహారిక, చైతన్య 2020 డిసెంబర్ లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.