నీట్‌ అక్రమాలపై స్పందించిన డీకే శివకుమార్

63చూసినవారు
నీట్‌ అక్రమాలపై స్పందించిన డీకే శివకుమార్
నీట్‌ పరీక్షల నిర్వహణలో అవకతవకల ఆరోపణలు, ప్రశ్నాపత్రం లీకేజ్‌ వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ అక్రమాలపై తానూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించానని అన్నారు. ఈ విషయంపై సర్వోన్నత న్యాయస్ధానం స్పందించిన తీరు ప్రశంసనీయమని తెలిపారు. ఈ వ్యవహారంపై కోర్టు ఎన్టీఏ తీరును ఎండగట్టిందని పేర్కొన్నారు. లక్షలాది విద్యార్ధుల భవితవ్యం, వారి ఆకాంక్షలు మనకు ప్రధానమని మంత్రి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్