శ్రీవారి తులాభారాన్ని పూర్వం తులాదండం అని పిలిచేవారు. భక్తులు ఈ మొక్కును తీర్చుకునేందుకు టీటీడీ దేవస్థానం ఆలయంలో తులాభారం ఏర్పాటు చేసింది. ఈ మొక్కు కింద కలకండ, బెల్లం, చక్కెర, బియ్యం, చిల్లర నాణాలను సమర్పించుకోవచ్చు. ఇందుకోసం ఆయా ద్రవ్యాలను దేవస్థానం వారు తులాభారం వద్దనే అందుబాటులో ఉంచారు. భక్తులు చేయాల్సిందల్లా సమర్పించాల్సిన ద్రవ్యాలకు సంబంధించి సరిపడ డబ్బులను చెల్లించి మొక్కును తీర్చుకోవచ్చు.