దీపావళి పండుగ సందర్భంగా ఓ కుక్క చేసిన పనికి అంతా ఖంగుతిన్నారు. యజమాని ఇంటి ముందు టపాసులు కాలుస్తుండగా కుక్క సడెన్గా పటాకును నోట కరిచి ఇంట్లోకి తీసుకెళ్లింది. ఓ వైపు పటాకు నుంచి నిప్పు రవ్వలు వెదజల్లుతున్నా కుక్క భయపడకుండా దాన్ని పట్టుకుని ఇంట్లో అటూ ఇటూ తిరగడంతో ఇంట్లోని వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఇంతలో దాని యజమాని అప్రమత్తమై పటాకును లాక్కుని బయటపడేశాడు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.