పాములు లేని ఈ దేశం గురించి తెలుసా?

579చూసినవారు
పాములు లేని ఈ దేశం గురించి తెలుసా?
పసిఫిక్ మహాసముద్రంలో నైరుతి దిక్కులో ఉన్న న్యూజిలాండ్ దీవిలో అసలు పాములే ఉండవు. సుమారు 85 మిలియన్ ఏళ్ల క్రితం ఇది గోండ్వానాలాండ్ నుంచి విడిపోయింది. దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఈ దేశం చుట్టూ చాలా ప్రాంతాల్లో పాములుంటాయి. కానీ, అవి సముద్రాన్ని ఈదుకుంటూ లోపలికి రాలేకపోయాయి. ఇక విదేశాల నుంచి ఎవరూ న్యూజిలాండ్‌కు పాములు తీసుకురాకూడదనిఅక్కడి చట్టాలు చెబుతున్నాయి. ఇక్కడి జూలోనూ ఒక్కపాము కనిపించదు.

సంబంధిత పోస్ట్