ఉప్పు, చక్కెరను అంతరిక్షంలోకి అనుమతించరు. ఎందుకంటే వీటిని వ్యోమగాములు స్పేస్‌లో చల్లుకోలేరు. ఇవి అక్కడి వాతావరణంలో తేలుతూ కళ్లు, నోరు, ముక్కులో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. బ్రెడ్స్, కుకీస్ తీసుకెళ్లరు. వాటి జీవిత కాలం తక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ వినియోగంపై నాసా నిషేధం విధించింది. ఎందుకంటే అంతరిక్ష కేంద్రాన్ని వ్యోమగాములు అత్యంత ఏకాగ్రతతో 24X7 పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఐస్‌క్రీమ్‌లాంటి పదార్థాలు సున్నితమైన పరికరాలకు ఆటంకాలు కలిగిస్తాయి.