నారేప వృక్షం ప్రత్యేకత ఏంటో తెలుసా?

73చూసినవారు
నారేప వృక్షం ప్రత్యేకత ఏంటో తెలుసా?
దేవాలయం ముందుండే ధ్వజస్తంభంలోనూ దైవశక్తి ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతోంది. ఈ ధ్వజస్తంభానికి అత్యధికంగా నారేప చెట్లను ఉపయోగిస్తారు. ఈ చెట్టు అధికంగా పాపికొండల్లో లభ్యమవుతుంది. అన్ని చెట్లలో కంటే నారేప వృక్షానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కర్ర ఎండకు ఎండినా.. వానకు తడిసినా ఏమాత్రం చెక్కు చెదరదు. ప్రకృతి విపత్తులు తలెత్తినా తట్టుకుని దశాబ్దాలపాటు అలాగే ఉంటుంది. ఈ చెట్టును తరలించాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి.

సంబంధిత పోస్ట్