అఫ్గానిస్థాన్‌ను వణికిస్తున్న వరదలు.. 68 మంది మృతి

63చూసినవారు
అఫ్గానిస్థాన్‌ను వణికిస్తున్న వరదలు.. 68 మంది మృతి
భారీ వర్షాలతో అఫ్గానిస్థాన్‌లో అతలాకుతలం అవుతోంది. తాజాగా వరదల్లో చిక్కుకుని పశ్చిమ ప్రావిన్స్ ఘోర్‌లో 50 మంది, ఉత్తర ప్రావిన్స్ ఫరయాబ్‌లో 18 మంది చనిపోయినట్లు తాలిబన్ అధికారులు పేర్కొన్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో భారీ వరదల కారణంగా 300 మందికి పైగా మరణించినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. చాలా ప్రాంతాలకు ఆహారాన్ని ట్రక్కుల ద్వారా చేరవేయలేకపోతున్నామంది.

సంబంధిత పోస్ట్