ప్రస్తుతం చాలా మంది మహిళలను వేధిస్తున్న సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. చాలా మంది చిన్నచిన్న విషయాలకు స్ట్రెస్‌కు గురవుతారు. దీని వల్ల థైరాయిడ్ పనితీరులో మార్పులు వచ్చి, ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుందంట. మధుమేహంతో బాధపడేవారికి కూడా హైపోథైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్ వల్ల కూడా థైరాయిడ్ వస్తుంది. నిద్ర లేమి, ఫోన్ ఎక్కువగా చూడటం కూడా థైరాయిడ్ రావడానికి ఒక కారణమని వైద్యులు చెప్తున్నారు.