మటన్‌ పేరుతో కుక్క మాంసం.. క్లారిటీ

77చూసినవారు
మటన్‌ పేరుతో కుక్క మాంసం.. క్లారిటీ
రాజస్థాన్‌ నుంచి బెంగళూరుకు మటన్‌ పేరుతో కుక్కమాసం రవాణా చేస్తున్నారంటూ బెంగళూరు కేఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్‌లో రెండు రోజుల క్రితం హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం స్పందించి, సంబంధిత అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు అనుమానాస్పద మాంసం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. చివరికి ఆహార భద్రతా కమిషనరేట్ అధికారులు అది మేక మాంసం అని నిర్ధారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్