పెద్ద పెద్ద శబ్దాలు, మంటలు, టపాసులు అంటే సాధారణంగా జంతువులు భయపడతాయి. వాటి దగ్గరకు కూడా వెళ్లవు. అలాంటిది ఓ కుక్క ఏకంగా వెలిగించిన భూచక్రంతో ఆడుకుంది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. దీపావళి సందర్భంగా కొంతమంది టపాసులు కాలుస్తున్నారు. ఓ వ్యక్తి భూచక్రాన్ని అంటించగా అక్కడే ఉన్న ఓ కుక్క ఆసక్తిగా చూస్తోంది. భూచక్రం తిరుగుతున్న సమయంలో ముందుకూ వెనక్కూ కదులుతూ శునకం ఆడుకుంది.