వ్యక్తిని కింద పడేసి కరిచిన కుక్కలు (వీడియో)

71చూసినవారు
కర్ణాటకలోని బాగల్‌కోట్ ప్రాంతంలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. ఇల్కల్ నగర్ గాంధీచౌక్ సమీపంలో ఓ వ్యక్తి ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో అతడిపై హఠాత్తుగా వీధి కుక్కలు దాడి చేశాయి. గుంపుగా వచ్చి ఒక్కసారిగా అతడిని కింద పడేశాయి. అనంతరం దారుణంగా కరిచాయి. వీధికుక్కల దాడిలో గాయపడిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్