తమిళనాడు మాజీ మంత్రి, సినీ నిర్మాత ఆర్‌ఎం వీరప్పన్ (98) కన్నుమూశారు. ఎంజీఆర్, జయలలిత క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన శాసనసభ స్పీకర్‌గా, అన్నాడీఎంకే శాసన మండలి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. రాజకీయ నాయకుడే కాకుండా సినీ నిర్మాతగా కూడా వ్యవహరించారు. సత్య మూవీస్ నిర్మాణ సంస్థ ద్వారా ఎంజీఆర్, రజనీ కాంత్, కమల్‌హాసన్ సహా పలు నటుల చిత్రాలను నిర్మించారు. ‘బాషా’ సినిమాకి ఆయనే నిర్మాత.