వాస్తు శాస్త్రం ప్రకారం మనిషి జీవితంపై తాబేలు మంచి ప్రభావం చూపుతుందని అంటారు. తాబేలును విష్ణువు అవతారంగా భావిస్తారు. ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచితే ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు. కొందరు తమ చేతిలో తాబేలు ఉంగరాన్ని ధరిస్తారు. తాబేలు ఉంగరం ధరిస్తే ఆర్థిక సమస్యలు కూడా పోతాయట. అయితే ఈ ఉంగరం అందరికీ శ్రేయస్కరం కాదని వాస్తులో చెప్పబడింది. తాబేలు ఉంగరాన్ని మేషం, వృశ్చికం, మీనం, కన్య రాశుల వారు ఈ ఉంగరాన్ని ధరించకూడదు. ఒకవేళ ధరించాలనుకుంటే పండితుల సలహా తీసుకోవడం మంచిది.