తన కూతురిని ఓ వీధి కుక్క కరిచిందనే ఆరోపణతో ఓ వ్యక్తి ఆ కుక్కను దారుణంగా చంపేశాడు. మధ్యప్రదేశ్‌లోని గుణాలో జరిగిన ఈ ఘటన సీసీ టీవీలో రికార్డయింది. ఓ కుక్క ఓ బాలికను కరవడంతో ఆమె తండ్రి కుక్కపై అత్యంత క్రూరంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. పోలీసులు వివరాల ప్రకారం, పప్పు మొదట కుక్కను కర్రలతో కొట్టాడు. ఆపై వేడి నిప్పులు చల్లాడు. అక్కడితో ఆగకుండా గాయపడిన కుక్కను బైక్ వెనుక తాళ్లతో కట్టి వీధుల్లో తిప్పి చివరికి బండ రాయితో కొట్టి చంపాడు.