చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమొద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ 'మెగాపవర్ ఈవెంట్'లో పవన్ మాట్లాడారు. సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం ఊరికే పెంచడం లేదని.. దాని వల్ల జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పవన్ అన్నారు. టికెట్ ధరల పెంపు విషయంలో నెగెటివ్ ప్రచారం జరుగుతోందని అన్నారు. సినిమాలు తీసేవాళ్ళే సినిమాల గురించి మాట్లాడాలని పవన్ పేర్కొన్నారు.