హెచ్‌ఐవీని పూర్తిగా నయం చేసే చికిత్సలేవీ లేవు. కానీ ఏఆర్‌టీ చికిత్సతో చాలావరకు నియంత్రించుకోవచ్చు. మందులను జీవితాంతం వాడుకోవటం తప్పనిసరి. ఇవి ఎలా పనిచేస్తున్నాయన్నదీ పరీక్షించుకోవాల్సి ఉంటుంది. రక్తంలో సీడీ4, సీడీ8 టి కణాల సంఖ్య పెరుగుతుంటే మందులు సమర్థంగా పనిచేస్తున్నాయని, వైరస్ ఉద్ధృతి తగ్గుతోందనే అర్థం. కొన్ని మందులు కాలేయం వంటి కీలక అవయవాల మీద దుష్ప్రభావం చూపే అవకాశముంది. కాబట్టి నెలకోసారి విధిగా డాక్టర్‌ను సంప్రదించాలి.