TG: పాలమూరు జిల్లా అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ పాలనలోనైనా పాలమూరును అభివృద్ధి చేసుకోనివ్వండంటూ ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. జిల్లాలో తాగు నీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తుంటే కొందరు చిల్లర రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు. పాలమూరు బిడ్డగా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే తనని చరిత్ర క్షమించదని సీఎం చెప్పారు. తనపై రాజకీయంగా కక్ష సాధించండి తప్ప ప్రాజెక్టులను అడ్డుకోవద్దని కోరారు.