2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇటీవల ఆయన తీరు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారుతోంది. తాజాగా తన నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలను కూల్చుతున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మధ్య ఈ- ఫార్ములా రేస్ వలన హైదరాబాద్‌కు మంచే జరిగిందని, కేసీఆర్ కుటుంబం అంటే తనకు గౌరవమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో దానం ఎందుకు ఇలా ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరా తీస్తోంది.