సాధారణ పంటలతో పోలిస్తే రైతులు కూరగాయల సాగుతోనే అధిక దిగుబడులు పొందుతున్నారు. ఈ క్రమంలోనే కాకరకు డిమాండ్ పెరుగుతోంది. సాధారణ విధానాలతో పోలిస్తే పందిరి విధానంలో సాగు చేసిన పంట నాణ్యతగా ఉండి, మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతోంది. దీంతోపాటు 40-50 శాతం అధిక దిగుబడులు పొందవచ్చు. ఒకే రకం విత్తనాలు కాకుండా ఒకే భూమిలో చాలా రకాల సీడ్స్‌ను విత్తుకునే ప్రయత్నం చేయాలి. దీని ద్వారా రైతు అధిక దిగుబడులు పొందవచ్చు.