మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అక్కడి కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నప్పటికీ మందసౌర్‌లో ఒక్క చుక్క కూడా పడుటలేదని స్థానిక ప్రజలు గాడిదలను తీసుకొచ్చి పొలాలకు పంపించి వర్షం పడాలని కోరుకున్నారు. అనంతరం వారి కోరిక మేరకు వర్షం కురవడంతో గాడిదెలకు గులాబీ జామ్ తినిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.