దోస పంటను సాగు చేసిన కాలాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి రోజూ లేదా రోజు విడిచి రోజుకు 2-3 గంటలు నీటిని డ్రిప్‌తో అందించాలి. కాయలు పెరిగే దశలో, పక్వానికి వచ్చే దశలో నీటి తడుల్లో హెచ్చు తగ్గులు లేకుండా పొలంలో తేమ తగు మాత్రంగా సమంగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే కాయలు పగుళ్లు వస్తాయి. దోస పంటపై ప్రారంభ దశ నుంచే పురుగుల తీవ్రత అధికంగా ఉంటుంది. ఎర్రనల్లి, గుమ్మడి పురుగులు వైరస్ తెగులు ఆశించే అవకాశం ఎక్కువ.