ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ఏటా అక్టోబరు 24న నిర్వహిస్తారు. పోలియో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన డాక్టర్ జోనాస్‌సాల్క్ కృషికి గుర్తుగా రోటరీ ఇంటర్నేషనల్ 1985లో ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. రోటరీ ఇంటర్నేషనల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి పోలియో వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా 1988లో గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ (జీపీఈఐ)ను ఏర్పాటు చేశాయి.