ఆఫ్ఘానిస్థాన్ లో జరిగిన రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 52 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 76 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం కాబుల్-కాందహార్లను కలిపే హైవేపై ఓ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. మరోవైపు అదే రహదారిపై బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఘాజ్నీ ప్రావిన్స్ లోని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో చిన్నారులు, మహిళలున్నట్టు అధికారులు తెలిపారు.