పర్యాటకులను పరుగులు పెట్టించిన తూనీగలు (వీడియో)

64చూసినవారు
అమెరికాలోని ఓ బీచ్‌లో సేద తీరుతున్న సందర్శకులను తూనీగలు హడలెత్తించాయి. వాటి ధాటికి అందరూ బీచ్ నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లోని మిస్క్వామికట్ బీచ్‌లో ఈ ఘటన జరిగింది. తూనీగలు లక్షల సంఖ్యలో ఆ బీచ్ పైకి దూసుకొచ్చాయి. అంత భారీ సంఖ్యలో తూనీగలను చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. కొందరు దాక్కునేందుకు ప్రయత్నించగా, మరికొందరు వీడియో తీశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్