ప్రతి రోజూ మూడు కప్పుల కాఫీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు. అంతేకాకుండా అటువంటి వారిలో జీవన శైలి సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటున్నదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. డయాబెటిస్, గుండె సమస్యల బారిన పడే ముప్పు 40 నుంచి 50శాతం వరకు తగ్గుతుందని తెలిపింది. రోజుకు మూడు కప్పుల కాఫీ తీసుకున్న వాళ్లలో గుండెపోటు, హై బీపీ, మధుమేహం.. మొదలైన సమస్యల ముప్పు తగ్గినట్టు సింటిస్ట్ లు గుర్తించారు.