తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు చలికి గజగజా వణుకుతున్నారు. శనివారం అర్ధరాత్రి నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు.. మెదక్‌లో అత్యల్పంగా 14.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆదిలాబాద్‌లో 15.7, పటాన్చెరులో 16.2, దుండిగల్‌లో 18, నిజామాబాద్‌లో 18.7, హనుమకొండ, రామగుండం, హకీంపేటలో 19, హైదరాబాద్‌లో 19.1 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. కాగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.