భారత్‌లో మందులకు లొంగని బ్యాక్టీరియా

53చూసినవారు
భారత్‌లో మందులకు లొంగని బ్యాక్టీరియా
భారత్‌లోని ఆసుపత్రుల్లో వచ్చే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు మొండిగా తయారవుతున్నాయని భారత వైద్యపరిశోధన మండలి(ICMR) అధ్యయనంలో తేలింది. యాంటీబయాటిక్స్‌ చికిత్సకు ఇవి లొంగడం లేదని వెల్లడైంది. రక్తంలో ఇన్‌ఫెక్షన్ల (BSI)కు ప్రధానంగా కారణమవుతున్న క్లెబ్సియెల్లా నిమోనియే, యాసినెటోబ్యాక్టర్‌ బౌమెనియై అనే సూక్ష్మజీవులు ఇమిపెనెమ్‌ అనే యాంటీబయాటిక్స్‌కు లొంగడంలేదని పరిశోధకులు తెలిపారు. ఇవి BSI ఇబ్బంది లేని రోగులపై మాత్రం పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్