AP: కోనసీమ(D) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం మలికిపురంలో జరిగిన జనసేన మీటింగ్ లో రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కనిపించారు. పెండింగ్ పనుల కోసమే MLA దేవవరప్రసాద్ ను కలిసినట్లు ఆయన వివరణ ఇచ్చారు. ఆయన పార్టీ మారుతారనే ప్రచారం లోకల్ గా నడుస్తోంది. 2019లో జనసేన తరపున గెలిచి వైసీపీలోకి వెళ్లారు రాపాక వరప్రసాద్. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.