ఫిబ్రవరిలో జరగబోయే RBI పరపతి విధాన కమిటీ సమావేశంలో కీలక రేట్లలో కోత ఉండొచ్చని పరిశ్రమల సంఘం సీఐఐ అంచనా వేస్తోంది. వృద్ధికి ఊతమిచ్చేందుకు రేట్ల కోతకు దిగొచ్చని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుండగా.. 5-7 తేదీల్లో ఎంపీసీ సమావేశం జరగనుంది. కార్మిక సంస్కరణలను సైతం ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.