జపాన్‌లో సోమవారం భూకంపం సంభవించింది. రాజధాని టోక్యోకు ఈశాన్యంగా ఉన్న ఇబారకి ప్రిఫెక్చర్ ప్రాంతంలో భూప్రకపంనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.8గా నమోదైనట్లు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. భూకంప కేంద్రం ఇబారకి ప్రిఫెక్చర్ నుంచి 90 కి.మీ లోతులో ఉంది. సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. అయితే ఈ ప్రభావంతో సెంట్రల్ టోక్యోలో ప్రకంపనలు సంభవించాయి. దీంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.