బెంగళూరుకు బయల్దేరిన సీఎం చంద్రబాబు

63చూసినవారు
బెంగళూరుకు బయల్దేరిన సీఎం చంద్రబాబు
కుప్పం నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. ద్రావిడ యూనివర్సిటీ ఇందిరాగాంధీ స్టేడియంలోని హెలిప్యాడ్ దగ్గర బుధవారం సీఎం చంద్రబాబుకు అధికారులు, టీడీపీ నేతలు వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం బెంగళూరు విమానాశ్రయానికి బయల్దేరారు. సీఎం బెంగళూరు నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికి.. ప్రధాని పర్యటనలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్