అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శుక్రవారం
భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఫిలడెల్ఫియా నుంచి న్యూయార్క్ వరకు, అలాగే అమెరికాలోని తూర్పు ప్రాంతంలోని లాంగ్ ఐలాండ్ వరకు
భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైన ఈ
భూకంపం కారణంగా పలు ఇళ్లు, భవనాలు కంపించాయి. ప్రపంచ వింతల్లో ఒకటైన లిబర్టీ విగ్రహం కూడా
భూకంపం ధాటికి దెబ్బతిన్నది.