ప్రతి రోజు క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ తినడం వల్ల కళ్లకు చాలా మంచిది. క్యారెట్‌లో ఫైబర్ శరీరంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అందుకే దీనిని షుగర్ వ్యాధిగ్రస్తులు హాయిగా తినవచ్చు. ఇంకా బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది. ముఖ్యంగా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో క్యారెట్ చాలా మేలు చేస్తుంది.