ఉల్లికాడలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉల్లికాడల్లో విటమిన్ సి, విటమిన్ బి2, థయామిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే ఫోలేట్లు గుండె జబ్బులని అదుపులో ఉంచుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. ఇంకా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. బరువు తగ్గడంతో పాటు మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ సమస్య నుంచి కాపాడుతుంది.