ఎరుపు అరటి పండు తింటే అధిక బరువు, డయాబెటిస్ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. పసుపు అరటి కంటే ఎరుపు అరటిలో బీటా కెరోటిన్, విటమిన్ సి, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఎరుపు అరటి పండ్లు తింటే కంటిచూపును మెరుగుపరుస్తుంది. దృష్టి లోపాలను కూడా నివారిస్తుంది. మహిళల్లో కలిగే రక్తహీనతను తగ్గిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.