మొలకెత్తిన రాగులను తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన రాగులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్లో ఉంటుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది.