హైదరాబాద్‌లో BRS హయాంలో నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ కేసులో బుధవారం BLN రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు ఆయనను ఈడీ అధికారులు విచారించారు. విచారణలో కీలకమైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. నిధుల బదలాయింపులో అరవింద్ కుమార్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల పాత్ర ఉందని ఈడీ అధికారులకు BLN రెడ్డి వివరించారు.