ఫాల్కన్ కంపెనీ ప్రతినిధులకు ఈడీ షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసి పారిపోయిన కంపెనీ ఎండీ, సీఈవో, సీవోలకు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఈడీ.. తాజాగా వారిపై కేసు నమోదు చేసింది. ఈ కంపెనీ అసత్య ప్రకటనల ద్వారా ఒక్క హైదరాబాద్‌లోనే రూ.850 కోట్లు వసూలు చేసింది. 22 షెల్ కంపెనీల ద్వారా ఆ డబ్బును విదేశాలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.